అనంతపురం జిల్లా బొమ్మనహళ్ మండలం నేమకల్లు కంకర క్వారీలో అక్రమంగా బ్లాస్టింగ్ చేస్తుండగా... గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. కోర్టు ఉత్తర్వులను దిక్కరించి ఓ ప్రజాప్రతినిధికి చెందిన క్వారీలో తెల్ల కంకర కోసం బ్లాస్టింగ్ చేస్తున్నారు. నలుగురు వ్యక్తులను బొమ్మనహల్ పోలీస్ స్టేషన్లో గ్రామస్థులు అప్పగించారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బొమ్మనహళ్ పోలీసులకు తాము ఫిర్యాదు చేసినా... కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వ్యవహరించారని స్థానికులు తెలిపారు.
కంకర క్వారీలపై ఉత్తర్వులు ఏంటి?
కంకర క్వారీలపై హరిత ట్రిబ్యునల్లో ప్రస్తుతం కేసు నడుస్తుంది. కంకర క్వారీలపై ఈనెల 15లోగా నివేదిక సమర్పించాలని కోర్టు ఆంధ్ర ప్రదేశ్ మైన్స్ అండ్ జియాలజీ అధికారులను ఆదేశించింది. ఇది వరకు హరిత ట్రిబ్యునల్ కంకర క్రషర్లు నడపడానికి మాత్రమే అనుమతులు మంజూరు చేసింది. కంకర క్వారీలకు ఎలాంటి అనుమతులూ ఇవ్వలేదు.
క్వారీలో బ్లాస్టింగ్ చేస్తున్న వారిని అడ్డుకున్న గ్రామస్థులు - నేమకల్లు కంకర క్వారీ పేలుళ్లపై అడ్డుకున్న గ్రామస్థులు
నేమకల్లు కంకర క్వారీలో పేలుళ్లు చేస్తుండగా గమనించిన గ్రామస్థులు వారిని అడ్డుకున్నారు. నలుగురు వ్యక్తులను పోలీసులకు అప్పగించారు.
నేమకల్లు కంకర క్వారీ పేలుళ్లపై అడ్డుకున్న గ్రామస్థులు
ఇదీ చదవండి :