ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతకు చేరుకున్న నారా లోకేశ్‌.. కాసేపట్లో విద్యార్థులకు పరామర్శ - tdp leader nara lokesh

గాయపడిన ఎస్ఎస్​బిఎన్ కళాశాల విద్యార్థులను కాసేపట్లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించనున్నారు. హైదరాబాద్ నుంచి అనంతపురానికి చేరుకున్న ఆయనకు.. పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు.

గాయపడిన విద్యార్థులను నేడు పరామర్శించనున్న నారాలోకేశ్
గాయపడిన విద్యార్థులను నేడు పరామర్శించనున్న నారాలోకేశ్

By

Published : Nov 10, 2021, 3:10 AM IST

Updated : Nov 10, 2021, 11:19 AM IST

నారా లోకేశ్ అనంతపురానికి చేరుకున్నారు. కాసేపట్లో... గాయపడిన ఎస్ఎస్​బిఎన్ కళాశాల విద్యార్థులను పరామర్శించనున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఆయనకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా తొలుత విద్యార్థిని జయలక్ష్మిని పరామర్శిస్తారు. తరువాత విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. విద్యార్థులు, విద్యార్థి సంఘం నాయకులతో ఎయిడెడ్ కళాశాలల విలీనంపై లోకేష్ చర్చించనున్నారు.

ఎయిడెడ్ కళాశాలలను ప్రైవేటీకరించటం వల్ల ఫీజుల భారంపై విద్యార్థుల అభిప్రాయాలు తీసుకోనున్నారు. ఈ ముఖాముఖిలో వామపక్ష పార్టీల నేతలు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొంటారు. లోకేష్ పర్యటన వివరాలు తెదేపా నేత కాలవ శ్రీనివాసులు వివరించారు.

ఇదీ చదవండి:

కూలిన ఆశలు...మనస్తాపంతో తల్లీకూతుళ్లు ఆత్మహత్య

Last Updated : Nov 10, 2021, 11:19 AM IST

ABOUT THE AUTHOR

...view details