ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: మాజీఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి - ananthapuram newsupdates

అనంతపురంలోని లలితకళా పరిషత్​లో తెదేపా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని... మాజీఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Must work towards the goal of winning
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి:మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి

By

Published : Nov 22, 2020, 4:14 PM IST

స్థానిక ఎన్నికల్లో తెదేపా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని మాజీఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అనంతపురంలోని లలితకళా పరిషత్​లో తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించింది. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను చేపట్టిందని... దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. ఎన్నికల్లో ఐక్యంగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. వైకాపా రాజకీయాలకు బలైన ప్రజలకు అండగా నిలవాలని సూచించారు.

ఇదీ చదవండి:

ఎంపీటీసీ అభ్యర్థి భర్తపై హత్యాయత్నాన్ని ఖండించిన చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details