అనంతపురం జిల్లాను రెండుగా విభజిస్తారనే ఊహాగానాల నేపథ్యంలో కళ్యాణదుర్గంలో ఆందోళనలు పెరుగుతున్నాయి. కళ్యాణ దుర్గం నియోజకవర్గాన్ని పుట్టపర్తిలో కలుపతారని ప్రభుత్వం నివేదికలు తయారు చేసిందని... అలా చేస్తే తాము ఇబ్బందులకు గురవుతామని ముస్లింలు ఆందోళన చేశారు. కళ్యాణదుర్గం మసీద్ సర్కిల్లో ముస్లింలు మానవహారంగా ఏర్పడ్డారు. ఈ ధర్నాకు జనవిజ్ఞాన వేదిక,, పలు ప్రజా సంఘాలు మద్దతుగా నిలిచాయి. ప్రస్తుతం లాగానే కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అనంతపురంలోని కొనసాగించాలని కోరారు. లేకుంటే కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రాన్ని మడకశిర, ఉరవకొండ, రాయదుర్గం నియోజకవర్గాలను కలిపి జిల్లా కేంద్రంగా ప్రకటించాలని మైనారిటీలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి
'కళ్యాణదుర్గాన్ని పుట్టపర్తిలో కలపొద్దు' - kalyana durgam
కళ్యాణ దుర్గం నియోజకవర్గాన్ని పుట్టపర్తిలో కలుపతారని ప్రభుత్వం నివేదికలు తయారు చేసిందని... అలా చేస్తే తాము ఇబ్బందులకు గురవుతామని ముస్లింలు ఆందోళన చేశారు.
ముస్లింలు ఆందోళన