ఆస్తి వివాదం.. తమ్ముడిని హత్య చేసిన అన్న - conflicts among family
కుటుంబంలో తలెత్తిన ఆస్తి వివాదాల వల్ల ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆస్తి పంపకాలలో అన్నాతమ్ముళ్ల మధ్య జరిగిన గొడవను మనసులో ఉంచుకొని సొంత అన్నావదినలు కలిసి హత్య చేశారు.
అనంతపురం జిల్లా నార్పల మండలం గారబావి కొట్టాలకు చెందిన బండి నాగార్జున(32) అన్నావదినలతో కలిసి ఉండేవాడు. నాలుగు నెలల క్రితమే వివాహమైన నాగార్జునకు తన అన్నయ్యకు మధ్య ఆస్తి విషయమై తగదాలు వచ్చాయి. ఈ తగాదాలు ఎక్కువవ్వటంతో తమ్ముడిని అడ్డు తొలగించుకోవాలని అనుకున్నారు నాగార్జున అన్నావదినలు. మంచంపై పడుకొని ఉన్న నాగార్జునను ఇనుపరాడ్‌తో బలంగా మోదటంతో అక్కడిక్కడే మృతి చెందాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకొన్నారు.