ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరు సరికాదని ఎమ్మార్పీఎస్ నేతలు ఆరోపించారు. అనంతపురం జిల్లా నార్పలలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమంటూ... నిండు సభలో మాదిగల ఆత్మగౌరవాన్ని జగన్ దెబ్బతీశారని నాయకులు ఆరోపించారు.ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి తన మాటలను వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
"ఎస్సీ వర్గీకరణపై సీఎం జగన్ తీరు సరికాదు"
అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ ఎస్సీ వర్గీకరణపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మార్పీఎస్ ఆందోళన నిర్వహించింది.
ఎమ్మార్పీఎస్