ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కరోనా అంటించేందుకే తెదేపా ఎంపీల దిల్లీ పర్యటన' - టీడీపీ ఎంపీల దిల్లీ పర్యటనపై ఎంపీ మాధవ్ కామెంట్స్

రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు తెదేపా నేతల దగ్గర ఏ అంశం లేదని వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని రాష్ట్రపతి కూడా మెచ్చుకుంటారన్నారు. భాజపా నేతలకు కరోనా అంటించేందుకు తెదేపా ఎంపీలు దిల్లీ వెళ్లారని ఎంపీ ఎద్దేవా చేశారు.

ఎంపీ గోరంట్ల మాధవ్
ఎంపీ గోరంట్ల మాధవ్

By

Published : Jul 17, 2020, 3:12 PM IST

రాష్ట్రంలో అన్ని రకాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే.. రాష్ట్రపతికి ఏమని ఫిర్యాదు చేయడానికి తెదేపా ఎంపీలు దిల్లీకి వెళ్లారని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రశ్నించారు. తెదేపా ఎంపీల వద్ద ఫిర్యాదు చేయడానికి ఏ అంశం లేదని ఆయన అనంతపురంలో వ్యాఖ్యానించారు. గతంలో భారతీయ జనతా పార్టీ తెదేపా నేతలను బయటకు తరిమేసిందని.. అది మనసులో పెట్టుకుని ఇప్పుడు వారికి కరోనా అంటించడానికే వారు దిల్లీ వెళ్లినట్టు ఉందని ఆయన అన్నారు.

రాష్ట్రంలో పరిస్థితిపై రాష్ట్రపతి నివేదిక తెప్పించుకున్నా.. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలను చూసి ఆయన అభినందిస్తారని మాధవ్ అన్నారు. తప్పు చేసిన వారిని మాత్రమే విచారణ సంస్థలు జైలుకు పంపుతున్నాయని.. ఇందులో దురుద్దేశాలు ఆపాదించవద్దని తెదేపా నేతలకు ఆయన సూచించారు.

ఇదీ చదవండి :ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం..

ABOUT THE AUTHOR

...view details