ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్​​ మొబైల్​ ఆక్సిడెంట్​ ట్రక్ ప్రారంభం

అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్​లో 'రోడ్​​ మొబైల్​ ఆక్సిడెంట్​ ట్రక్​'ను దక్షిణ మధ్య రైల్వే డివిజన్​ మేనేజర్​ అలోక్​ తివారి ప్రారంభించారు. 70 లక్షల వ్యయంతో బ్రేక్​ డౌన్​ ట్రక్కును అందుబాటులోకి తీసుకువచ్చారు.

రైలు ప్రమాదాలకు గుంతకల్లు వద్ద త్వరగా పరిష్కారం

By

Published : Jul 9, 2019, 5:01 PM IST

అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్​లో "రోడ్​ మొబైల్​ ఆక్సిడెంట్​ ట్రక్​"ను మంగళవారం ప్రారంభించారు. దక్షిణ మధ్య రైల్వేలో ఇది రెండోదని తెలిపారు. ఏవైనా రైలు, గూడ్స్​ ప్రమాదాలు సంభవించినప్పుడు ఘటనా ప్రాంతానికి సిబ్బంది యంత్రాలను తరలించేందుకు బ్రేక్​ డౌన్​ స్పెషల్​ ఆక్సిడెంట్​ రిలీఫ్​ ట్రైన్​ (ART) ప్రత్యేక రైలును ఉపయోగించేవారు. ఈ రైలుని ఘటనా స్థలానికి పంపడానికి కొంత సమయం కేటాయించాల్సి వచ్చేది. సమీపంలో ఆక్సిడెంట్​ జరిగినపుడు సమయాన్ని నివారించడానికి ఇప్పుడు ప్రత్యేకంగా 70 లక్షల వ్యయంతో బ్రేక్​ డౌన్​ ట్రక్కును అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందులో అన్ని పరికరాలు అమర్చి తగు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే 'రోడ్​ మొబైల్​ ఆక్సిడెంట్​ ట్రక్​' తో చిన్నచిన్న ప్రమాదాలు జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంటుందని తెలిపారు. దీని ద్వారా రైల్వేకు నిధులు ఆదా అవుతాయన్నారు. దీనిని సి.అండ్​.డబ్ల్యూ అధికారుల పర్యవేక్షణలో నిర్వహిస్తుందని దక్షిణ మధ్య రైల్వే డివిజన్​ మేనేజర్​ అలోక్​ తివారి తెలిపారు.

రైలు ప్రమాదాలకు గుంతకల్లు వద్ద త్వరగా పరిష్కారం

ABOUT THE AUTHOR

...view details