ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''మా ఆయనకే ఓటేయండి.. మళ్లీ గెలిపించండి'' - election campaign

ఎన్నికలకు వారం రోజుల సమయమే ఉన్నందున అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు సైతం ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఓ మహిళకు ప్రభుత్వ పథకాలను వివరిస్తున్న విజయలక్ష్మి

By

Published : Apr 4, 2019, 6:00 PM IST

భర్తకు సాయంగా భార్య ప్రచారం
అనంతపురం పట్టణతెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వైకుంఠం ప్రభాకర్ చౌదరి తరఫున.. ఆయన సతీమణి విజయలక్ష్మి ప్రచారంచేశారు. కార్యకర్తలతో కలిసి నగరంలోని 18,19 డివిజన్లలో పర్యటించారు. ఇంటింటికీవెళ్లి తెదేపా ప్రభుత్వం అమలు చేసినసంక్షేమ పథకాలను, తన భర్త చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్లకు వివరించారు. తన భర్తకు మళ్లీ ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే..నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తారని ప్రజలకు హామీ ఇచ్చారు. రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్లాలంటే చంద్రబాబునే మరొకసారి ముఖ్యమంత్రినిచేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details