MLA Rasamayi Cycling video : తెలంగాణలో ఓ ఎమ్మెల్యే రూటే సపరేటు.. చేపట్టిన ప్రతి కార్యక్రమంలో వినూత్నతను చూపిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. మానకొండూరు మండలంలోని లింగాపూర్, వెల్డి, రంగపేట, పచ్చునూర్, ఊటూర్, వేగురుపల్లి, లక్ష్మీపూర్ గ్రామాలలో పర్యటించారు. అభివృద్ధి పనులు పరిశీలించిన ఆయన కల్యాణ లక్ష్మి, సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీలో అందరిని ఆకర్షించారు.
సైకిల్‌పై ఎమ్మెల్యే రసమయి.. ఇంటింటికి తిరుగుతూ చెక్కుల పంపిణీ - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు
MLA Rasamayi Cycling video : నిత్యం ప్రజా కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉండే నాయకులకు తమ ఆరోగ్యం కోసం వ్యాయామం చేయాలంటే సమయం దొరకడం కష్టమే. దానికి ఓ ఉపాయం ఆలోచించినట్టున్నారు. తెలంగాణలోని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. కల్యాణ లక్ష్మీ, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడానికి సైకిల్ ఎక్కారు. అలా సైకిల్‌పై లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా చెక్కులు అందించారు.
రంగపేట గ్రామంలో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అర్హులైన లబ్ధిదారుల ఇళ్లకు వినూత్న తరహాలో సైకిల్‌పై వెళ్లి చెక్కులు అందజేశారు. టీఆర్ఎస్ నాయకులు ద్విచక్ర వాహనాలతో వెనకాల వస్తుండగా ఎమ్మెల్యే రసమయి సైకిల్‌పై వెళ్లడం చూపరులను ఆకర్షించింది. మానకొండూరు నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని రోడ్డు మార్గాలు సరిగా లేవని ప్రజలు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కానీ టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజా సేవకై ఆరాటం.. రసమయికే సొంతం అంటూ నినాదాలు చేస్తూ సాగిపోతున్నారు.
ఇవీ చదవండి: