అనంతపురం జిల్లా గుత్తి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో విషాదం జరిగింది. పబ్జీ గేమ్ ఆడేందుకు ఫోన్ ఇవ్వలేదని ఓ బాలుడు బ్లేడ్‌తో గొంతు కోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.
కుటుంబసభ్యులు వెంటనే బాలుణ్ని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.