ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Audio Viral: 'మా నాన్న మాట కూడా వినను.. నిన్ను చంపేస్తా' - ఏపీ వార్తలు

Audio Viral: మంత్రి విశ్వరూప్‌ కుమారుడు కృష్ణారెడ్డి.. వైకాపా ఎంపీటీసీ సత్తిబాబుపై బెదిరింపులకు పాల్పడ్డాడు. నా ఇల్లు అంటిస్తారా.. మా అమ్మా, నాన్నను చంపేస్తారా.. మిమ్మల్ని చంపుతానంటూ.. బెదిరించిన ఆడియో ఇప్పుడు వైరల్​గా మారింది.

minister vishwaroop son krishna reddy threats to YSRCP  MPTC Audio viral
వైకాపా ఎంపీటీసీకి మంత్రి కుమారుడి బెదిరింపులు

By

Published : Jun 2, 2022, 12:51 PM IST

Updated : Jun 3, 2022, 5:30 AM IST

వైకాపా ఎంపీటీసీకి మంత్రి కుమారుడి బెదిరింపులు

Minister Son Audio Viral: ‘నీ యాక్టింగ్‌ చాలా బాగుంది సత్తిబాబన్నా.. మొన్న ఒక కాలు విరిగింది కదా, ఏ కాలది? రెండు కాళ్లూ విరిచేస్తాను. పిచ్చి పిచ్చి డ్రామాలు ఆడకు.. చంపేస్తాను. ఇప్పటివరకు విశ్వరూప్‌ అమాయకత్వాన్నే చూశావు, కృష్ణారెడ్డి దమ్ము చూడలేదు’ అని కోనసీమ జిల్లా ఈదరపల్లి వైకాపా ఎంపీటీసీ సభ్యుడు అడపా సత్తిబాబును మంత్రి పినిపే విశ్వరూప్‌ కుమారుడు కృష్ణారెడ్డి హెచ్చరించారు. అసభ్య పదజాలంతో కూడిన ఈ బెదిరింపుల వాయిస్‌ సామాజిక మాధ్యమాల్లో గురువారం చక్కర్లు కొట్టింది. సత్తిబాబుకు ఫోన్‌ చేసిన కృష్ణారెడ్డి.. ‘కోనసీమ జిల్లా కావాలని వెళ్లినోళ్లు కాపులు కాదు, బీసీలూ కాదు. ఎవరో తెలుసా?’ అని దూషించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ‘ఆ రోజు కోనసీమ జిల్లా కావాలని నేను పేపర్‌ పట్టుకు వెళ్లాను. తగలబెట్టేస్తున్నారని తెలిసి వెనక్కి వచ్చాను. నన్ను నమ్ము అన్నా.. నా పిల్లల మీద ఒట్టు’ అని సత్తిబాబు ప్రాధేయపడినా.. కృష్ణారెడ్డి వినిపించుకోలేదు. ‘చెప్పేది వినరా.. నా బాబు (విశ్వరూప్‌) పాముకు పాలుపోసి పెంచినట్లు నిన్ను పోషించాడు. మీ ఇంట్లో మీ అమ్మని, పెళ్లాన్ని పెట్టి పెట్రోలు పోసి తగలేస్తే ఏం చేస్తావు? మీ వల్ల మా అమ్మ చచ్చిపోయుండేది. నా అమ్మను మీరు తగలెట్టేద్దురు. మా అమ్మ చచ్చిపోయి ఉంటే.. నా బాబును చంపేద్దును. జిల్లాకు ఎవరి పేరు పెడితే మీకెందుకురా? ఇంట్లో పిల్లల్ని, భార్యల్ని తగలేయడానికి ఎవరిచ్చార్రా ధైర్యం? దమ్ముంటే తగలెట్టేయడానికి 4వేల మంది కాదు.. 10వేల మంది రండిరా.. నేను ఇంట్లోనే ఉంటాను’ అని సవాలు విసిరారు. ‘కోనసీమ జిల్లా అంబేడ్కర్‌ జిల్లా అయితే నీకేంటి? నీకొచ్చిన నాలుగు రూపాయలు పోయిందా? రాసుకో.. నిన్ను వదలను, ఈ రెండేళ్లు ఏం చేస్తానో చూడు. మా నాన్న మాట కూడా వినను. నిన్ను చంపేస్తాను’ అని కృష్ణారెడ్డి హెచ్చరించారు. ‘15 రోజుల కిందట చంద్రబాబు వచ్చి అంబేడ్కర్‌ జిల్లా ఇవ్వాలన్నారా.. లేదా? అదే చంద్రబాబుకు పవన్‌కల్యాణ్‌ వత్తాసు పలుకుతున్నారా.. లేదా? మరి మీరెందుకు వెళ్లారు? అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఉంటుంది. కోనసీమ జిల్లా రాదు. నాకు రాజకీయం వద్దు, డబ్బు వద్దు. అమ్మ ముఖ్యం. జాతి మీద ఇంట్రెస్ట్‌ ఉంటే వాడిని అంటించుకోమని చెప్పు. పక్కోడి ఇంటికి నిప్పంటించడం మగతనం కాదు. ఇది కులాలకు సంబంధించింది కాదు. ఇంకోసారి ఈ టాపిక్‌ వచ్చిందనుకో, నేనే నిన్ను చంపేస్తా.. ఇది రాసుకో..’ అని ఎంపీటీసీ సభ్యుడు సత్తిబాబును మంత్రి కుమారుడు కృష్ణారెడ్డి హెచ్చరించారు. ఈ విషయమై మంత్రి విశ్వరూప్‌ను, ఆయన కుమారుడు కృష్ణారెడ్డిని ఫోన్లో వివరణ కోరేందుకు ‘ఈనాడు’ ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. సత్తిబాబు ఫోన్‌ స్విచాఫ్‌ వచ్చింది.

అప్రమత్తమైన పోలీసులు

ఎంపీటీసీ సభ్యుడిని చంపేస్తానని హెచ్చరించడంతో పాటు, ఉద్యమంలో పాల్గొన్నవారిపై మంత్రి తనయుడు వ్యాఖ్యలు చేసిన ఆడియో వైరల్‌ కావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ అంశంపై ఆరా తీయడంతో పాటు క్షేత్రస్థాయి పరిస్థితిపైనా దృష్టిసారించారు. అమలాపురం అల్లర్ల ఘటనలో ఎంపీటీసీ సభ్యుడు సత్తిబాబుపై పోలీసు కేసు నమోదైంది.

ఇవీ చూడండి:

Last Updated : Jun 3, 2022, 5:30 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details