అనంతపురం జిల్లా పెనుకొండ నుంచి గెలుపొందిన శంకర నారాయణకు మంత్రివర్గంలో స్థానం దక్కింది. సౌమ్యుడిగా పేరు సంపాదించుకున్న శంకర నారాయణ... ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీ మెంబర్గా, ధర్మవరం నియోజకవర్గ ప్రచార కార్యదర్శిగా పనిచేశారు. వైఎస్సార్ మరణం తరువాత... జగన్ వెంట నడిచారు. 2019లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందినా... ఆయన్ను మంత్రి పదవి దక్కించుకున్నారు.
అనంతపురం నుంచి శంకరనారాయణ - ap minister
వైకాపా అధినేత, ముఖ్యమంత్రి జగన్ తన మంత్రివర్గంలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం కల్పించారు. పార్టీకి విధేయులుగా ఉన్న వారికి మంత్రివర్గంలో చోటు కల్పించారు.
శంకరనారాయణ
యం. శంకరనారాయణ
నియోజకవర్గం: పెనుకొండ
వయస్సు:54
విద్యార్హత: బీకాం, ఎల్‌ఎల్‌బీ
రాజకీయ అనుభవం:అనంతపురం జిల్లా వైకాపా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.