ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాలనే లక్ష్యంతో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తున్నారు. అనంతపురం జిల్లాలోని పెనుకొండ, సోమందేపల్లి మండలాల్లో 172 పాఠశాలలోని సుమారు 12 వేల మంది విద్యార్థులకు సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా నవ ప్రయాస అనే సంస్థ మధ్యాహ్న భోజనం అందిస్తుంది. కానీ ఈ భోజనం నాణ్యతగా లేకపోవడంతో అగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు పెనుకొండ మండలంలోని కురుబవాండ్ల పల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలకు భోజనం సరఫరా చేయడానికి వచ్చిన వాహనాన్ని అడ్డుకున్నారు. మండలంలోని అన్ని పాఠశాలలోనూ ఇదే పరిస్థితి నెలకొందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు కోడిగుడ్లు సరఫరా చేయడం లేదన్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి గతంలో మాదిరిగానే పాఠశాల వద్దనే భోజనం వడ్డించే ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు.
మధ్యాహ్న భోజనాన్ని అడ్డుకున్న గ్రామస్తులు ! - midday meal
పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన, పుష్టికరమైన భోజనం అందించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజనం సరిగా లేదని అనంతపురం జిల్లా వాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాస సంస్థ అందిస్తున్న ఆహార పదార్థాలు రుచిగా లేవని...పిల్లలు రోజూ తినకుండానే ఇంటికి వస్తున్నారని వాపోతున్నారు.
మధ్యాహ్న భోజనాన్ని అడ్డుకున్న గ్రామస్తులు
ఇదీ చూడండి:మిట్టమధ్యాహ్నం మహిళ మెడలోంచి గొలుసు చోరీ