అనంతపురం జిల్లా ధర్మవరం మండలం కునుతూరు వద్ద బిల్లే నరేంద్ర అనే యువకుడిపై దాడి జరిగింది. కనగానపల్లి మండలం మామిళ్లపల్లికి చెందిన నరేంద్ర ద్విచక్ర వాహనంపై ధర్మవరం వెళ్తుండగా ద్విచక్ర వాహనాలపై వెంబడించిన దుండగలు.. నరేంద్రపై రాళ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నరేంద్ర గతంలో వైకాపా సోషల్ మీడియా ధర్మవరం నియోజకవర్గ ప్రతినిధిగా పనిచేసేవాడు. ఇటీవలే భాజపాలో చేరాడు.
యువకుడిపై దాడి.. వైకాపా నాయకుల పనేనంటూ భాజపా ఆరోపణ - dharam latest news
అనంతపురం జిల్లా కనగాలపల్లి మండలం మామిళ్లపల్లికి చెందిన నరేంద్ర అనే వ్యక్తిపై కొందరు వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై వెంబడించి దాడి చేశారు. అధికార పార్టీపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నాడని వైకాపా శ్రేణులే దాడికి తెగబడ్డాయని భాజపా నాయకులు ఆరోపిస్తున్నారు.
ధర్మవరంలో యువకుడిపై దాడి వార్తలు
అధికార పార్టీపై సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్నాడని నరేంద్రపై వైకాపా శ్రేణులు దాడి చేసినట్లు భాజపా నాయకులు ఆరోపిస్తున్నారు. వినయ్ అనే వ్యక్తితో పాటు మరికొందరు దాడి చేశారని ధర్మవరం గ్రామీణ పోలీసులకు నరేంద్ర ఫిర్యాదు చేశాడు. మెరుగైన వైద్యం కోసం అతనిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి:జల్సాల కోసం అక్రమాలు.. అరెస్ట్ అయిన ముగ్గురు మిత్రులు