Chiranjeevi God Father Pre Release Event: అనంతపురంలో మెగాస్టార్ అభిమానుల సందడి నెలకొంది. అక్టోబర్ 5న చిరంజీవి కథానాయకుడిగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా విడుదల కానుంది. చిరంజీవి హీరోగా దర్శకుడు మోహన్‌రాజా తెరకెక్కించిన చిత్రమిది. మలయాళ హిట్ సినిమా 'లూసిఫర్'కు రీమేక్‌గా రూపొందించారు. ఈ చిత్రం విడుదల సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున అభిమానులు చేరుకున్నారు. వారి సందడితో కోలాహలం నెలకొంది.
అనంతలో వర్షం.. గొడుగు పట్టుకుని 'గాడ్ ఫాదర్' ప్రసంగం - Satya Dev
Mega Star Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటేనే ఓ క్రేజ్... ఆ హీరో సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే.. చిరంజీవిని ఒక్కసారైనా చూడాలని ప్రతి అభిమానికి కోరిక ఉంటుంది. ఇక ఆ హీరో తమ ప్రాంతానికి వస్తే.. వారి ఆనందానికి హద్దు ఉంటుందా.. ఇదే ఫీలింగ్‌లో ఇప్పుడు అనంతపురం చిరు అభిమానులు ఉన్నారు. ఎందుకంటే.. ఈరోజు అనంతపురంలో 'గాడ్ ఫాదర్' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఇప్పటికే అభిమానులంతా కార్యక్రమం జరిగే ప్రాంతానికి చేరుకుని సందడి చేశారు. కార్యక్రమం జరుగుతుండగా వర్షం పడింది... మెగాస్టార్ చిరంజీవి వర్షంలోనే ప్రసంగించారు.
మెగస్టార్ చిరంజీవి
కార్యక్రమం జరుగుతుండగా వర్షం కురిసింది. అభిమానులు తడుచుకుంటూనే కార్యక్రమంలో పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి వర్షంలో గొడుగు పట్టుకుని ప్రసంగించారు. తానెప్పుడూ రాయలసీమలో అడుగుపెట్టినా.. వరుణుడు పులకరిస్తూనే ఉంటాడని తెలిపారు.
ఇవీ చదవండి:
Last Updated : Sep 28, 2022, 10:15 PM IST