అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఏపీఎన్జీవో భవన్లో సీఐటీయూ, ప్రజాసంఘాల ముఖ్య నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కరోనాను కట్టడి చేయటంలో కేంద్రం ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు జిల్లా కోశాధికారి బీహెచ్ రాయుడు విమర్శించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 20 లక్షల కోట్ల ప్యాకేజీలో శ్రమ జీవులకు స్థానం లేకుండా చేశారన్నారు.
సీఐటీయూ, ప్రజాసంఘాల నాయకుల సమావేశం
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఏపీఎన్జీవో భవన్లో సీఐటీయూ, ప్రజాసంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు. కరోనాను నియంత్రించటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని.. 20 లక్షల కోట్ల ప్యాకేజీలో శ్రమజీవులకు స్థానం లేకుండా పోయిందని విమర్శించారు.
వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీల కబంధహస్తాల్లో పెడుతూ మూడు ఆర్డినెన్సులు విడుదల చేసినందుకు దేశానికి పట్టుకొమ్మలైన ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నందుకు నిరసనగా ఆగస్టు 9న మండల పట్టణ కేంద్రాలలో జరిగే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జూలై 23న గ్రామ వార్డు సచివాలయల వద్ద జరిగే కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలని తెలిపారు. ప్రభుత్వాలు తమ వైద్య విధానాలను మార్చుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి :రాజధానిగా అమరావతినే కొనసాగించాలి: అమరావతి పరిరక్షణ సమితి