ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. కొవిడ్ బాధితులకు ప్రాణ సంకటం

ఓ వైపు కరోనా విజృంభిస్తుంటే.. మరోవైపు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం రోగుల పాలిట శాపంగా మారుతోంది. అనంతపురం జిల్లాలో కొవిడ్​తో మరణించిన వ్యక్తిని తీసుకెళ్లిన స్ట్రెచర్​ పైనే.. రోగులకు తాగు నీరు తీసుకెళ్లటం.. ఆందోళన కలిగించింది.

By

Published : May 27, 2021, 12:58 PM IST

Published : May 27, 2021, 12:58 PM IST

medical staff negligency
వైద్య సిబ్బంది నిర్లక్ష్యం

అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో మృతుల తరలింపు.. కొవిడ్ బాధితులకు సాగునీటి సీసాలు ఒకే స్ట్రెచర్ పై తీసుకెళ్లటం ఆందోళన రేపుతోంది. జిల్లాలోని బొరంపల్లి ప్రాంతానికి చెందిన ఆంజనేయులు కరోనాతో మరణించారు. మృతదేహాన్ని స్ట్రెచర్​ పై తీసుకొచ్చి వాహనంలోకి ఎక్కించారు. నిమిషాల వ్యవధిలో.. అదే స్ట్రచర్ పై కొవిడ్ బాధితులకు తాగునీటి సీసాలను తరలించారు అక్కడ వైద్య సిబ్బంది. ఇది చూసిన కొవిడ్ బాధితులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. జిల్లా ఆసుపత్రిలో పడకల కొరత కొనసాగుతూనే ఉంది. అలాంటిది ఏమీ లేదని జిల్లా యంత్రాంగం చెబుతున్నా.. వాస్తవ పరిస్థతి భిన్నంగా ఉంది. ఒకే మంచంపై ఇద్దరేసి రోగులు.. నేలపైనే వృద్ధులు నిరీక్షించాల్సి వస్తోంది. జిల్లా యంత్రాంగం ఇప్పటికైనా పడకల సంఖ్య పెంచాలని బాధితులు కోరుతున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details