రైల్వే జోన్‌పై జేసీ మాట - vishaka
విశాఖ రైల్వే జోన్ ప్రకటన ఎన్నికల తాయిలమని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. మోదీ సభ విజయవంతం కావడానికే ఈ ప్రకటన చేశారని విమర్శించారు.
రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో ఒక్క సీటు కూడా భాజపా గెలుచుకునే పరిస్థితి లేదని తెదేపా ఎంపీ దివాకర్ రెడ్డి జోస్యం చెప్పారు. వాల్తేర్ డివిజన్‌ను విశాఖ జోన్‌లో కలపకపోవడం... ప్రత్యేక రైల్వే జోన్ కావాలన్న ప్రజల డిమాండ్‌కు తూట్లు పొడిచేలా ఉందని ఆయన విమర్శించారు. జోన్ ఏర్పాటులో ఇలాంటి మెలికలు పెట్టడం కేవలం కక్ష సాధింపు చర్యే అని అనంతపురంలో ఏర్పాటు చేసిన మీడిమా సమావేశంలో ఆరోపించారు.