అనంతపురం జిల్లా ధర్మవరంలోని లక్ష్మీ చెన్నకేశవపురం కాలనీలో హరినాథ్ అనే చేనేత కార్మికుడు చీరతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం వీరంతా బెంగళూరులో నివాసముంటున్నారు. కుమారుడు కర్ణాటకలో వివాహం చేసుకున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో కోడలు అత్తమామలపై కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో మనస్థాపానికి గురైన హరినాథ్ ఉరేసుకుని మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబ కలహాలతో.. చేనేత కార్మికుని బలవన్మరణం - hanging
కుటుంబ కలహాలతో చేనేత కార్మికుడు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఆత్మహత్య