అనంతపురం జిల్లా మల్లికార్జునపల్లి గ్రామస్థులు... రోడ్డుపై బైటాయించి ధర్నా చేశారు. కళ్యాణదుర్గం నుంచి రాయదుర్గం వరకూ చేపడుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో... శ్రీరామ్ రెడ్డి తాగునీటి పథకానికి తరచూ అవాంతరాలు ఏర్పడుతున్నాయని ఆరోపించారు. సంబంధిత గుత్తేదారు నిర్లక్ష్యం వల్ల ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి పథకానికి చెందిన అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టినా... మళ్లీ మళ్లీ లీకేజీలు అవుతున్నాయని ఆగ్రహించారు. ప్రస్తుతం ఉన్న పైపులను కాసా రోడ్డు పక్కకు మళ్లించాలని గుత్తేదారును డిమాండ్ చేశారు. ధర్నాతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్న హామీతో ధర్నా విరమించారు.
తాగునీటి పైపులైన్లపై.. రోడ్డు నిర్మాణ పనుల ప్రభావం! - anathapuram
మల్లికార్జున గ్రామస్తులు ధర్నా చేశారు. రోడ్డు నిర్మాణ పనుల కారణంగా... తమ గ్రామాలకు అరకొరగా సరఫరా అవుతున్న తాగునీటి పైపులైన్లు పాడైపోతున్నాయని ఆందోళనకు దిగారు. పైపు లైనును పక్కకు మార్చాలని డిమాండ్ చేశారు.
'తాగునీటి వృథాను ఆపాలంటూ ధర్నా'