కదిరి లక్ష్మీనృసింహునికి శోభాయమానంగా మల్లెపూల ఉత్సవం - కదిరి
కదిరి లక్ష్మీనరసింహ స్వామి వారికి మల్లెపూల ఉత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు ఈ ఉత్సవం చూసేందుకు భారీగా తరలి వచ్చారు.
'కదిరి లక్ష్మీనృసింహునికి శోభాయమానంగా మల్లెపూల ఉత్సవం'
అనంతపురం జిల్లాలో శ్రీ కదిరి లక్ష్మీనరసింహ స్వామికి మల్లెపూల ఉత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయంలోని ఉత్సవాల మండపంలో స్వామివారిని మల్లెపూలతో శోభాయమానంగా అలంకరించారు. ఉభయ దేవేరులతో కొలువుదీర్చి తిరువీధుల్లో విహరింపచేశారు. ప్రత్యేక పల్లకిలో ఊరేగుతున్న శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. అనంతరం స్వామివారికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.