జిల్లాలోని ఎగువ ప్రాంత ఎమ్మెల్యేలు మడకశిరకు నీరు రాకుండా అడ్డుకుంటున్నారని అనంతపురం జిల్లా రైతులు అందోళన బాటపట్టారు. బలవంతంగా జలాలను తరలించుకుంటున్నారని ఆరోపించారు. మడకశిర ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయని, వెయ్యి అడుగుల బోరు వేసిన నీరు దొరకడం లేదని అవేదన వ్యక్తం చేశారు. కరవుతో రైతులు బెంగళూరుకు వలస పోతున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మడకశిర నియోజకవర్గంలోని ప్రతి చెరువును హంద్రీనివా జలాలతో నింపాలని కోరారు.
'మడకశిరకు నీళ్లు రానివ్వని ఎగువ ప్రాంత ఎమ్మెల్యేలు' - అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మార్వో కార్యాలయం వార్తలు
అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మార్వో కార్యాలయం వద్ద రైతులు ధర్నా చేపట్టారు. నియోజకవర్గంలోని చెరువులన్నింటిని హంద్రీనీవా జలాలతో నింపాలని నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మార్వోకు వినతి పత్రం సమర్పించారు.
హంద్రీనీవా జలాలను తరలిస్తున్నారని రైతుల అందోళన