ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

attack on students : విద్యార్థులపై లాఠీఛార్జ్... నేతలు ఫైర్ - ananthapuram crime

అనంతపురం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడాన్ని పలు పార్టీల నేతలు ఖండించారు. దశాబ్దాల చరిత్ర ఉన్న ఎస్ఎస్​బీఎన్.కాలేజీను ఎయిడెడ్ గానే కొనసాగించాలని విద్యార్థులు చేస్తున్న ఆందోళనను పోలీసుల ద్వారా ఆపాలని చూడటం అప్రాజాస్వామికమని ఆరోపించారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీఛార్జీ చేయడం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యార్థుల లాఠీఛార్జ్​పై నేతలు ఫైర్
విద్యార్థుల లాఠీఛార్జ్​పై నేతలు ఫైర్

By

Published : Nov 8, 2021, 9:52 PM IST

అనంతపురంలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జీ చేయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఖండించారు. శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జీ చేయడం అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిడెడ్ విద్యా సంస్థల ఆందోళనను రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతల సమస్యగా మారుస్తుండడాన్ని జనసేన పార్టీ తప్పుబట్టింది. దశాబ్దాల చరిత్ర ఉన్న ఎస్ఎస్​బీఎన్.కాలేజీను ఎయిడెడ్ గానే కొనసాగించాలని విద్యార్థులు చేస్తున్న ఆందోళనను పోలీసుల ద్వారా ఆపాలని చూడటం అప్రజాస్వామికమని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులతో కొట్టించడం నియంత పాలనకు నిదర్శనమని తెలుగుమహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు.

విద్యార్థులపై లాఠీఛార్జ్ అమానుషం అని తాడిపత్రి పురపాలిక ఛైర్మన్ జేసీ.ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఎస్ఎస్​బీఎన్.కళాశాల విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి అమానుషమని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం-పీడీఎస్​యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిచంద్ర అన్నారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులపై దాడి చేయించిన సీఎం జగన్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీఛార్జీ చేయడం హేయమైన చర్య అని, దాడికి పాల్పడిన సీఐ, సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు.

ఇవీచదవండి.

ABOUT THE AUTHOR

...view details