కోర్టు ఆవరణలో న్యాయవాది పై ధర్మవరం పట్టణ సీఐ అష్రార్ బాషా అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ,ధర్మవరం కోర్టు విధులను ఐదో రోజూ బహిష్కరించారు న్యాయవాదులు.సిఐ పై చర్యలు తీసుకోవాలని కోర్టు వద్ద నుంచి పట్టణంలోని ప్రధాన రహదారి మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు న్యాయవాదులు.అనంతరం న్యాయవాదులు డీఎస్పీ రమాకాంత్ కు వినతి పత్రం అందజేశారు.
అనుచిత వ్యాఖ్యలు చేసిన సిఐ పై చర్యలు తీసుకోవాలి: న్యాయవాదులు - lawyers rally
కోర్టు ఆవరణలో ఓ న్యాయవాదిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ధర్మవరం సిఐ పై చర్యలు తీసుకోవాలని,గత ఐదు రోజులుగా న్యాయవాదులు విధులను బహిష్కరిస్తున్నారు. డీఎస్పీ రమాకాంత్ కు ఓ వినతిపత్రం సమర్పించారు.
బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న న్యాయవాదులు