ధర్మవరం పట్టణంలోని వైఎస్ఆర్ కాలనీ వద్ద పోలీసుల తనిఖీల్లో కర్ణాటక మద్యం పట్టుబడింది. ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 579 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు, 50 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ కరుణాకర్ వెల్లడించారు. వీటి విలువ రూ. 1.60 లక్షలు ఉంటుందన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి.. వాహనాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు.
ధర్మవరంలో కర్ణాటక మద్యం పట్టివేత... ఐదుగురు అరెస్ట్ - ananthapuram district latest news
వాహనంలో కర్ణాటక మద్యం తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను ధర్మవరం వైఎస్ఆర్ కాలనీ వద్ద పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి మద్యం సీసాలు, టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి నిందితులపై కేసు నమోదు చేశారు.
కర్ణాటక మద్యం పట్టుకున్న పోలీసులు
Last Updated : Aug 30, 2020, 8:38 PM IST