48 మంది రేషన్ డీలర్లపై పోలీసులకు ఫిర్యాదు - dealers
48 మంది చౌక ధరల డిపోల డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కంబదూరు మండల తహశీల్దార్... పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు
అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో 48 మంది చౌక ధరల సరుకుల డిపోల డీలర్లపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ ఆ మండల తహశీల్దార్.. సంబంధిత పోలీసులను కోరారు. ఈ మేరకు ఫిర్యాదు చేశారు. డీలర్లు ప్రభుత్వానికి బకాయి ఉన్న వందలాది క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. పౌరసరఫరాల చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని మండల తహశీల్దార్ బాలకృష్ణమూర్తి కంబదూరు పోలీసులను కోరారు. వారి జాబితాతో కూడిన ఫిర్యాదును పంపారు.