ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే వైకాపా విషప్రచారం' - సీఎం దిల్లీ టూర్​పై కాలువ శ్రీనివాసులు వార్తలు

వైకాపా ప్రభుత్వ వైఫల్యాలు, రాజధాని ఆందోళనల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే చంద్రబాబుపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని... తెదేపా నేతలు విమర్శించారు. ప్రజాధనంతో దిల్లీ పర్యటనలు చేస్తున్న సీఎం జగన్​... ఆ వివరాలు ప్రజల ముందుంచాలని మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. పోలవరం, రాజధాని నిర్మాణంపై ప్రధాని, హోంమంత్రి ఎలాంటి భరోసా ఇచ్చారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

tdp leaders
తెదేపా నేతలు

By

Published : Feb 15, 2020, 9:33 PM IST

మీడియాతో కాలవ శ్రీనివాసులు

ప్రజల సొమ్ముతో దిల్లీకి వెళ్లి వస్తున్న సీఎం జగన్​... ఆ పర్యటన వివరాలు గోప్యంగా ఉంచటం వెనుక అంతరార్థం ఏమిటని మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు ప్రశ్నించారు. ప్రతిపక్షనేత ఉన్నప్పుడు దిల్లీకి వెళ్లినప్పుడల్లా పర్యటన వివరాలు మీడియాకు చెప్పే జగన్.. ముఖ్యమంత్రి హోదాలో ఎందుకు చెప్పడంలేదని ప్రశ్నించారు. మూడు రాజధానుల చర్చ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు వైకాపా ప్రభుత్వం తెదేపాపై దుష్ప్రచారం చేస్తుందన్నారు.

ప్రజల దృష్టి మరల్చడానికే: ఉమామహేశ్వరనాయుడు

రాజధానిపై ప్రజల దృష్టి మరల్చడానికే చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని... తెదేపా నేత ఉమామహేశ్వరనాయుడు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వినాశక పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. దేశంలో అనేక చోట్ల ఐటీ దాడులు జరిగినా... చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శిపై మాత్రమే జరిగినట్లు వైకాపా ప్రచారం చేస్తుందన్నారు.

ఉమామహేశ్వరనాయుడు మీడియా సమావేశం

వైకాపా విషప్రచారం: నామాల రాంబాబు

వైకాపా ప్రభుత్వం దురుద్దేశంతో చంద్రబాబును లక్ష్యంగా చేసుకుందని తూర్పు గోదావరి జిల్లా తెదేపా అధ్యక్షుడు నామాల రాంబాబు ఆరోపించారు. పి.గన్నవరం నియోజకవర్గంలోని పోతవరంలో మాట్లాడిన ఆయన... చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శిపై జరిగిన దాడులపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వివరించారు.

నామాల రాంబాబు మీడియా సమావేశం

ఐటీ దాడులను తెదేపాకు ఆపాదిస్తున్నారు: కొల్లు రవీంద్ర

దేశవ్యాప్తంగా జరిగిన ఐటీ దాడులను... తెదేపాకు ఆపాదించాలని చూడటం సిగ్గుచేటని మాజీమంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలోని తెదేపా కార్యాలయంలో మాట్లాడిన ఆయన... గతంలో చంద్రబాబుపై 25 కేసులు పెట్టి ఒక్కటీ రుజువు చేయలేకపోయారని గుర్తుచేశారు.

కొల్లు రవీంద్ర మీడియా సమావేశం

ఇదీ చదవండి :'5 కోట్ల జనాభాకు మూడు రాజధానులు అవసరమా ?'

ABOUT THE AUTHOR

...view details