Kalava Srinivasulu comments on Minister Peddyreddy: వైసీపీని భూస్థాపితం చేయడానికి రాష్ట్రంలో బీసీలు, దళితులు కంకణం కట్టుకుని ఉన్నారని టీడీపీ మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు. అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లాకు వచ్చిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. పంట నష్టం, సహాయక చర్యలపై మాట్లాడకుండా రైతులను విస్మరించారని ఆరోపించారు.
వైసీపీని బీసీలు, దళితులు భూస్థాపితం చేస్తారు: కాలవ శ్రీనివాసులు - Ex TDP Minister Kalava Srinivasulu
Kalava Srinivasulu comments on minister: టీడీపీ మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై మండిపడ్డారు. వర్షాల కారణంగా పంటలు నష్టపోయాయని అనంతపురానికి వచ్చిన మంత్రి పెద్దిరెడ్డి సహాయక చర్యలపై మాట్లాడకుండా రైతులను విస్మరించారని ఆరోపించారు. వైసీపీని భూస్థాపితం చేయడానికి రాష్ట్రంలో బీసీలు దళితులు కంకణం కట్టుకొని ఉన్నారని టీడీపీ మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు.
ప్రభుత్వం ఆదుకుంటామని భరోసా ఇవ్వలేదని, సమావేశంలో ప్రాజెక్టుల ఊసే లేదని తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో ఉండే రెడ్ల ఆధ్వర్యంలో సమావేశాలు జరిగాయని, బీసీలకు పెద్ద పీట ఎక్కడ వేశారని ప్రశ్నించారు. పాసిస్టు ధోరణితో వ్యవహరిస్తున్నారని, ఆర్టీసీ రీజినల్ చైర్మన్ పదవిలో ఉన్న దళిత మహిళను అవమానిస్తూ ఏడిపిస్తున్నారని అన్నారు. వైసీపీ పాలనపై బీసీలు, దళితులు రగిలిపోతున్నారన్నారు. రాష్ట్రాల్లో ఇలాటి శాడిస్ట్, సైకోలు ఉండకూడదని, వైసీపీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.
ఇవీ చదవండి: