మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 89వ జయంతి కార్యక్రమాన్ని అనంతపురం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ధర్మవరంలో పోలీస్ స్టేషన్ కూడలి వద్ద ఉన్న అబ్దుల్ కలాం విగ్రహానికి భాజపా మైనార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. తహసీల్దార్ నీలకంఠారెడ్డి కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థి సంఘాల నాయకులు కలాం సార్ కు నివాళులర్పించారు.
అనంతపురంలో కలాం జయంతి వేడుకలు - అనంతపురంలో కలాం జయంతి వేడుకలు
మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 89వ జయంతి కార్యక్రమాన్ని అనంతపురం జిల్లాలో ఘనంగా నిర్వహించారు.
అనంతపురంలో కలాం జయంతి వేడుకలు
కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్ లో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 89వ జయంతి వేడుకలను నిర్వహించారు. కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అబ్దుల్ కలాం సాంకేతిక పరిజ్ఞానంతో దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. తెదేపా అధినేత చంద్రబాబుకు మాజీ రాష్ట్రపతితో ఉన్న అనుబంధాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నారు.
ఇవీ చదవండి: విషాదం: తన ఇద్దరు పిల్లలను పొట్టన పెట్టుకున్న తండ్రి