ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కొవిడ్ బాధితులను ఆదుకోవటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది'

ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకొచ్చేవారిపై కేసులు పెట్టడం బాధాకరమని తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ ఇంఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. వైరస్ నియంత్రణలో చేతులెత్తేసిన జగన్ ప్రభుత్వన్ని ప్రశ్నించినవారిపై కేసులతో ఇబ్బందులకు గురిచేస్తూ.. సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.

కదిరి నియోజకవర్గం తెదేపా ఇన్​చార్జ్
కదిరి నియోజకవర్గం తెదేపా ఇన్​చార్జ్

By

Published : May 10, 2021, 6:01 PM IST

వైరస్ విస్తరణతో వందలాది మంది యువత అర్ధాంతరంగా మృతి చెందుతున్నారని తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ ఇంఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు ఆసుపత్రుల్లో పడకలు, ఇతర సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపే వారిపై కేసులు పెట్టి సమస్యను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

విపక్షాల సూచనలు, సలహాలతో కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాల్సింది పోయి.. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తూ కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు, లోకేష్ పై పెట్టిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని.. కొవిడ్ బాధితులకు సరైన సదుపాయాలు కల్పించడంతో పాటు 18 సంవత్సరాలు నిండిన వారందరికీ వ్యాక్సిన్ వేయాలని కందికుంట వెంకట ప్రసాద్ డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details