జూనియర్ కళాశాల విద్యార్థుల ఆందోళన - undefined
కడుపు మండిన జూనియర్ కళాశాల విద్యార్థులు రోడ్డెక్కారు. మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలంటూ ధర్నా చేశారు.
జూనియర్ కళాశాల విద్యార్థుల ఆందోళన
అనంతపురం జిల్లా రొద్దం మండల కేంద్రంలోని ఉన్న జూనియర్ కళాశాల విద్యార్థులు మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించాలని నిరసన వ్యక్తం చేశారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కళాశాల నుంచి తహసీల్దార్ కార్యాలయం వద్దకు ర్యాలీ చేస్తూ చేరుకున్నారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టాలంటూ నినదించారు. అనంతరం ఉప తహసీల్దార్ రామకృష్ణకు వినతి పత్రం అందజేశారు.
TAGGED:
విద్యార్థుల ఆందోళన