విలేకరిపై దాడికి పాల్పడిన నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని..జర్నలిస్టులపై దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ సత్య యేసుబాబుకి వినతి పత్రం అందించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎస్పీ మాట్లాడుతూ నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. దాడులు జరగకుండా చర్యలు తీసుకుంటామని జర్నలిస్టులకు హామీ ఇచ్చారు.
విలేకరిపై దాడిని ఖండిస్తూ జర్నలిస్టుల ర్యాలీ - జర్నలిస్టులు ర్యాలీ
అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఓ విలేకరిపై దాడి చేసిన సంఘటనను ఖండిస్తూ జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. జర్నలిస్టులపై దాడులు జరగకుండా తగిన జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోవాలని నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు.
జర్నలిస్టుల ర్యాలీ