ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా ప్రభుత్వానికి త్వరలో బుద్ధి చెబుతాం: జేసీ ప్రభాకర్ రెడ్డి - JC Prabhakar Reddy comments on ycp

త్వరలోనే వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని తెదేపా నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. వైకాపా నాయకుల అవినీతి అక్రమాలు, ఆగడాలకు తెదేపా అడ్డుకట్ట వేస్తుందని చెప్పారు. కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.

JC Prabhakar Reddy fires on ycp over attcks tdp cadre
జేసీ ప్రభాకర్ రెడ్డి

By

Published : Nov 17, 2020, 4:46 PM IST

తెదేపా నాయకులపై కక్ష సాధింపుతో అక్రమ కేసులు బనాయిస్తూ ఆగడాలకు పాల్పడుతున్న వైకాపా ప్రభుత్వానికి త్వరలో బుద్ధి చెబుతామని... తాడిపత్రి తెదేపా మాజీఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. అనంతపురంలో ఆత్మీయ కలయిక సమావేశంలో జేసీ పవన్​తో కలిసి ఆయన మాట్లాడారు. ప్రజలకు, తెదేపా కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

వైకాపా ప్రభుత్వం తమను భయభ్రాంతులకు గురి చేయడానికే అక్రమంగా కేసులు పెడుతోందని, అయినప్పటికీ ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. వైకాపా నాయకుల అవినీతి అక్రమాలు, ఆగడాలకు తెదేపా అడ్డుకట్ట వేస్తుందని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details