ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెజిస్ట్రేట్ ముందుకు జేసీ ప్రభాకర్​రెడ్డి

కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, తెదేపా నాయకుడు జేసీ ప్రభాకర్​రెడ్డిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. అనంతపురం ఒకటో పట్టణ పోలీసులు జేసీ ప్రభాకర్​రెడ్డిని విచారించాలని కోర్టులో పీటీ వారంట్లు వేశారు. మధ్యాహ్నం తర్వాత మెజిస్ట్రేట్ పీటీ వారంట్లపై నిర్ణయం తీసుకునే వీలుంది.

jc prabhakar reddy at megistrate hearing by video conference
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెజిస్ట్రేట్ ముందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి

By

Published : Jun 18, 2020, 3:00 PM IST

కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, తెదేపా నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేశారనే కేసులో అనంతపురం ఒకటో పట్టణ పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని అరెస్ట్ చేసి కడప కేంద్ర కారాగారానికి 14 రోజుల రిమాండుకు తరలించారు. అయితే అనంతపురం ఒకటో పట్టణ పోలీసులు మరో 3 కేసుల్ల్లో జేసీ ప్రభాకర్ రెడ్డిని విచారించాలని కోర్టులో పీటీ వారంట్లు వేశారు. ఆ పీటీ వారంట్లను కడప కేంద్ర కారాగారంలో ఉన్న జైలు సూపరింటెండెంట్​కు ఈ ఉదయం అందజేశారు.

కరోనా కారణంగా అనంతపురం పంపకుండా కడప కేంద్ర కారాగారం నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జేసీ ప్రభాకర్ రెడ్డిని హాజరు పరిచారు. అనంతపురం జిల్లా మెజిస్ట్రేట్ ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీటీవారంట్లపై విచారించారు. మధ్యాహ్నం తర్వాత మెజిస్ట్రేట్ పీటీ వారంట్లపై నిర్ణయం తీసుకునే వీలుంది. కాగా బీఎస్-3 వాహనాల రిజిస్ట్రేషన్ కేసులో మరో 3 రోజుల పాటు జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసు కస్టడీకి ఇవ్వాలని 2 రోజుల కిందటే అనంతపురం వన్ టౌన్ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. పోలీసు కస్టడీ పిటిషన్​పై సాయంత్రం మెజిస్ట్రేట్ నిర్ణయం తీసుకునే వీలుందని సమాచారం. ఒకవేళ జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసు కస్టడీకి ఇచ్చినా... కడప కేంద్ర కారాగారంలోనే విచారించాలని ఆయన తరపున న్యాయవాది కోర్టుకు విన్నవించారు. దీనిపై న్యాయమూర్తి ఏం నిర్ణయం తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది.

ఇవీ చదవండి... ఇటువంటి మంత్రులు ఉండటం దురదృష్టకరం

ABOUT THE AUTHOR

...view details