ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

IT RAIDS: 'రూ.800 కోట్లు అక్రమ లావాదేవీలను గుర్తించాం'

IT RAIDS: తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల నిర్వహించిన సోదాల్లో రూ. 800 కోట్ల అక్రమ లావాదేవీలను గుర్తించినట్లు ఆదాయపు పన్నుశాఖ తెలిపింది. ఎటువంటి లెక్కలు చూపని నగదు, భూముల కొనుగోలు, ఇతర ఖర్చులకు సంబంధించిన వివరాలు సోదాల్లో బయటపడినట్లు పేర్కొంది.

IT RAIDS
IT RAIDS

By

Published : Jan 11, 2022, 7:55 AM IST

IT RAIDS: మూడు స్థిరాస్తి సంస్థలపై నిర్వహించిన సోదాల్లో.. లెక్కలు చూపని రూ.800 కోట్లు అక్రమ లావాదేవీలను గుర్తించినట్లు ఆదాయపు పన్నుశాఖ వెల్లడించింది. రూ.1.64 కోట్ల నగదు మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఈనెల 5న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదాయపన్నుశాఖ ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహించినట్లు వివరించింది. కర్నూలు, అనంతపురం, కడప, నంద్యాల, బళ్లారి తదితర 24 ప్రాంతాల్లో ఈ సోదాలు చేసినట్లు పేర్కొంది.

సోదాల సమయంలో చేతితో రాసిన పుస్తకాలు, అగ్రిమెంట్లు తదితర అనేక నేరారోపణ పత్రాలు గుర్తించి.. స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేసింది. ప్రత్యేక సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌తోపాటు ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల ద్వారా డిజిటల్ డేటాను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. ఈ స్థిరాస్తి సంస్థలు.. ఆస్తుల రిజిస్ట్రర్డ్​ విలువ కంటే ఎక్కువ నగదును వసూలు చేస్తున్నట్లు గుర్తించామని ఆదాయపు పన్నుశాఖ వివరించింది. ఎటువంటి లెక్కలు చూపని నగదు, భూముల కొనుగోలు, ఇతర ఖర్చులకు సంబంధించిన వివరాలు సోదాల్లో బయటపడినట్లు తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details