అనంతపురం జిల్లాలో ఈసారి నీటి పంపకాల వ్యవహారం ఐఏబీకి సవాల్ గా మారనుంది. వర్షాకాలం వచ్చి రెండు నెలలు దాటినా, జిల్లాలో ఇప్పటి వరకు పడిన వర్షాలు అంతంత మాత్రమే. ఎగువ కురిసిన వర్షాలతో నిండిన తుంగభద్ర ప్రాజెక్టు హెచ్ ఎల్ సి కాలువ ద్వారా అనంతకు చేరుకున్నాయి. శ్రీశైలం నుండి కృష్ణా జలాలు హంద్రీనీవా కాలువ ద్వారా జీడిపల్లి జలాశయానికి వచ్చాయి. రెండు చోట్ల నుంచి నీరు జిల్లాలోకి ప్రవేశించడంతో సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించి నియోజకవర్గాలు, ప్రాజక్టుల వారిగా నీటి పంపిణీపై అధికారులు, ప్రజాప్రతినిధులు నేడు చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
ఉత్కంఠ నడుమ అనంత సాగునీటి సలహా మండలి భేటీ - Meeting
అనంతపురం జిల్లాలో నీటి విడుదల, పంపకాలపై అధికారులకు కత్తిమీద సాములా మారనుంది. సీజన్ లో 37 శాతం లోటు వర్షపాత ఉన్న జిల్లాలో తొలి ప్రాధాన్యతగా తాగు నీటికి ఇవ్వాలనే డిమాండ్ ఉంది. సాగు నీటి కోసం ఇప్పటికే నియోజకవర్గాల వారిగా నేతలు ప్రభుత్వానికి ప్రతిపాధనలు పంపించారు.
IrrigationAdvisory board Meeting today in Anantapur district.