ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పుట్టపర్తిలో అంతర్జాతీయ యువ సమ్మేళన సదస్సు - పుట్టపర్తి

అనంతపురం జిల్లా పుట్టపర్తిలో అంతర్జాతీయ యువ సమ్మేళన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సులో దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

భక్తిగీతాలతో సాయిని అలరిస్తున్న యువత

By

Published : Jul 16, 2019, 11:39 AM IST

సాయికుల్వంత్ మందిరంలో నిర్వహించిన యువసమ్మేళనం

అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని సాయికుల్వంత్ మందిరంలో నిర్వహించిన యువ సమ్మేళన సదస్సు వైభవంగా జరిగింది. ఇందులో పాల్గొన్న యువత తమ అభిప్రాయాలను చెప్పారు. ప్రపంచ గమనాన్ని మార్చగలిగే సత్తా యువతకు ఉందని... మానవాళిని సన్మార్గం వైపు నడిపించే బాధ్యత యువతదేనని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. తమ జీవిత కాలంలో భవిష్యత్ ను తీర్చిదిద్దుకునేందుకు సమయం కేటాయించడంతో పాటు సమాజంలో లోపాలను సరిదిద్దేందుకు తమ వంతు కృషి చేయాలన్నారు. సత్యసాయి ప్రబోధాలను, ప్రేమతత్వాన్ని ఆచరణాత్మకంగా పాటిద్దాం.. ప్రపంచానికి మన నినాదం చాటుదామంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం యువత నిర్వహించిన సంగీత కచేరి భక్తులను మంత్రముగ్దులను చేసింది. ఈ సందర్భంగా వేలాదిమంది సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details