ఎన్ఎంసీ బిల్లు వల్ల తమకు నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని మండిపడ్డారు. ఈ ఎన్ఎంసీ శిక్షణ వల్ల ఆరు నెలల కోర్సు చేసిన ప్రతి ఒక్కరు వైద్య వృత్తిలో రాణించడానికి వీలుందని, అయితే ఆరు సంవత్సరాలపాటు వైద్య వృత్తి నేర్చుకున్న తమకు ఎలాంటి ప్రయోజనం ఉంటుందని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఉండి ఎందుకు వైద్యం చేయాలి అని ప్రభుత్వాన్ని నిలదీశారు. కేంద్రం ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని మెడికోలు హెచ్చరించారు.
అనంతపురంలో ఎన్ఏంసీకి వ్యతిరేకంగా మెడికోల ధర్నా
కేంద్రం రాజ్యసభలో ప్రవేశపెట్టిన ఎన్ఏంసీ బిల్లును ఖండిస్తూ అనంతపురంలో మెడికోలు ధర్నాకు దిగారు . ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో చేసిన ధర్నాలో మెడికోలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ధర్నా చేస్తున్న మెడికోలు