ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొత్త ఆలోచనతో గుంతకల్లు రైల్వే డివిజన్

దక్షిణ మధ్య రైల్వేలోని గుంతకల్లు డివిజన్ రైల్వే స్టెషన్​లో యూ.టి.ఎస్ అప్లికేషన్ విధి విధానాలు గురించి రైల్వే అధికారులు చక్కటి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

అవగాహన సదస్సు నిర్వహిస్తున్న రైల్వే సిబ్బంది

By

Published : Jul 25, 2019, 9:49 AM IST

ప్రయాణికుల టికెట్లు తీసుకోవడంలో గంటల కొద్దీ జాప్యం అవుతుందని ఆతృతతో పరిగెత్తి రైలు ఎక్కబోయి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.ఈ ప్రమాదాల నుంచి ప్రయాణికులను రక్షించుకోవడనికి గుంతకల్లు రైల్వే ఒక కొత్త ఆలోచనతో నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. సులభ పద్దతిలో, టికెట్ కొనుగోలు వంటివి ఎలా చేసుకోవాలో,లఘుచిత్రం ద్వారా స్టేషన్ ఆవరణలో ప్రయాణికులకు చేసి చూపించారు. టికెట్ కోసం గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడకుండా ఉండే పరిస్థితికి స్వస్తి చెప్పే పద్దతులును కంటికి కనపడే విధంగా నాటకాలు ద్వారా ప్రజలకు అర్ధమయ్యే రీతిలో రైల్వే అధికారులు అవగాహన కల్పించారు.ఈ అప్లికేషన్ వల్ల సులభంగా ప్రయాణికుడు రైలు స్టేషన్​కు వచ్చే 15 నిమిషాలలోపు టికెట్ పొందవచ్చని, ఆ టికెట్​ను టికెట్ కలెక్టర్​కు రైలులో చూపిస్తే సరిపోతుందనీ రైల్వే సుపరింటెండెంట్ తెలిపారు.

అవగాహన సదస్సు నిర్వహిస్తున్న రైల్వే సిబ్బంది

ABOUT THE AUTHOR

...view details