రాష్ట్రంలో శాఖలవారీగా మొదలైన సమగ్ర భూ సర్వే పనులు అనంతపురం జిల్లాలో తుదిదశకు చేరుకున్నాయి. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా రెవెన్యూ డివిజన్‌కు ఒక గ్రామం చొప్పున ఐదింటిని ఎంపిక చేసిన రెవెన్యూ, సర్వే శాఖల అధికారులు.. ఆర్నెళ్ల క్రితం సర్వే మొదలుపెట్టారు. నాలుగు గ్రామాల నివేదికలు సిద్ధమవగా కల్యాణదుర్గం పరిధిలోని ఓ గ్రామంలో డ్రోన్ తీసిన చిత్రాలు ఇంకా రావాల్సి ఉంది. అది వచ్చాక ఆ నివేదికా సిద్ధమవుతుంది.
రాష్ట్రవ్యాప్తంగా నివేదికలు అందుకోనున్న సర్వే ఆఫ్ ఇండియాపరిశీలించి గ్రామ భూ పటం, సర్వే నంబర్ల వివరాలను అంతర్జాలంలో ఉంచుతారు. పైలట్ ప్రాజెక్టు పూర్తైనందున తొలి విడత సర్వే ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. గ్రామ సరిహద్దులు, గ్రామ కంఠం, ప్రభుత్వ భూముల్లో ఏర్పాటు చేసే సరిహద్దు రాళ్లకు సంబంధించి. గ్రానైట్ పరిశ్రమల్లోని వృథాను వినియోగించనున్నారు.