'కర్ణాటకకు తరలిస్తున్న 200బస్తాల రేషన్ బియ్యం పట్టివేత' - amnathapuram
అనంతపురం జిల్లా జరుట్ల రాంపురంలో అక్రమంగా కర్ణాటకకు తరలిస్తోన్న రేషన్ బియ్యం వాహనాన్ని స్థానికులు పట్టుకుని...పోలీసులకు అప్పగించారు.
'కర్ణాటకకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనం పట్టివేత'
అనంతపురం జిల్లా జరుట్ల రాంపురంలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని గ్రామస్థులు పట్టుకున్నారు. సుమారు 2వందల బస్తాల బియ్యాన్ని కర్ణాటక తరలిస్తున్నట్లు గుర్తించిన గ్రామస్థులు అడ్డుకున్నారు. ఇవి ఎక్కడవని ప్రశ్నించగా... సదరు వ్యక్తులు పరారయ్యారు. దీంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. రేషన్ బియ్యాన్ని, వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్న డ్రైవర్ ను పట్టుకుని పోలీసులు విచారిస్తున్నారు.