ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యంఅక్రమ నిల్వలు.. సెబ్​ అధికారుల దాడులు - కర్నూలులో కర్ణాటక మద్యం పట్టివేత

మున్సిపల్ ఎన్నికల వేళ అనంతపురం జిల్లాలో సెబ్​ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పలు చోట్ల అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మద్యం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Illegal alcohol seized  in anantapur district
అక్రమ మద్యం... సెబీదాడులు

By

Published : Mar 2, 2021, 7:43 PM IST

అనంతపురం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సెబ్​ అధికారులు అనుమానితుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. నగరంలోని పలు కాలనీల్లో అక్రమంగా నిల్వ చేసిన మద్యం, నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు సెబ్​ ఇన్​స్పెక్టర్ స్వర్ణలత తెలిపారు. సెబ్​ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మద్యం అక్రమంగా రవాణా చేసిన వారిపై 188 కేసులు నమోదు చేయడంతో పాటు 46 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. 198 మందిని అరెస్ట్ చేసి రిమాండ్​కు పంపామని, 127 మందిని బైండోవర్ చేసినట్లు తెలిపారు. పదేపదే నేరాలకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ అమలు చేశామన్నారు. మద్యం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కర్ణాటక మద్యం పట్టివేత

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 2,400 ప్యాకెట్ల కర్ణాటక మద్యాన్ని పోలీసులు పట్టుకున్నరు. కార్డన్ సెర్చ్ నిర్వహించగా మునెప్పనగర్​లో ఓ ఇంట్లో నిల్వ ఉంచిన మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని... ఒకరిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి

గొల్లపల్లిలో కర్ణాటక మద్యం స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details