రంజాన్ సోదరులకు ఇఫ్తార్ విందు - collector
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకు ఇఫ్తార్ విందును అనంతపురం ఎంపీ, ఎమ్మెల్యేలు ఏర్పాటు చేశారు. ముస్లిం సోదరులకు పారదర్శకంగా సబ్ప్లాన్లు అమలు చేసి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
రంజాన్ సోదరులకు ఇఫ్తార్ విందు
పారదర్శకంగా సబ్‌ప్లాన్ నిధులు అమలు చేసి ముస్లింలకు అండగా ఉంటామని అనంతపురం పార్లమెంట్ ఎంపీ తలారి రంగయ్య, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి చెప్పారు. అనంతపురంలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ముస్లింలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రార్థనలు నిర్వహించి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.