అనంతపురం జిల్లా గుత్తి మండలం బసినేపల్లిలో మహిళ దారుణ హత్య కేసును పోలీసులు 5 రోజుల్లోనే ఛేదించారు. భర్తే భార్యను చంపినట్లు పోలీసులు తేల్చారు.
బసినేపల్లిలో వివాహిత హత్య కేసును ఛేదించిన పోలీసులు - బసినేపల్లి క్రైమ్ న్యూస్
దుబారా ఖర్చులు చేయవద్దని చెప్పిందని భార్యను అతి దారుణంగా చంపేశాడు.. అనంతరం ఎవరో తన భార్యను హత్య చేశారని గ్రామస్థులను నమ్మించాడు. పోలీసులకు కట్టుకథలు చెప్పాడు.. పోలీసులకు అనుమానం వచ్చి తమదైన శైలిలో ప్రశ్నించేసరికి నిజం చెప్పాడు.
బసినేపల్లికి చెందిన సునంద, నాగార్జునకు తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. దుబారా ఖర్చులు, అప్పులు చేయవద్దని భార్య సునంద చెప్తుందని నాగార్జున తరచూ గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో పొలంలో పని చేసుకుంటున్న సునందను కలుపుతీయటానికి ఉపయోగించే పొలుగుతో అతి దారుణంగా కొట్టి చంపేశాడు. గ్రామంలోకి వెళ్లి తన భార్యను ఎవరో చంపేశారని గ్రామస్థులను నమ్మించాడు. పోలీసులను సైతం నమ్మించే ప్రయత్నం చేశాడు. నాగార్జున ప్రవర్తన పట్ల అనుమానం వచ్చి.. పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. సునందను తానే హత్య చేసినట్లు అంగీకరించాడు.
ఇదీ చదవండి:లాక్ డౌన్ లో అదును చూసి.. అందినంత దోచేశారు!