ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాపురానికి రాలేదని భార్యను హతమార్చిన భర్త - కట్టుకున్న వాడే కాలయముడు

కట్టుకున్న వాడే కాలయముడయ్యాడు. భార్యను చేయి పట్టుకుని నడిపించాల్సిన భర్తే కాటికి పంపాడు. కాపురానికి రాలేదని దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

Husband killed his wife
కాపురానికి రాలేదని భార్యను హతమార్చిన భర్త

By

Published : Dec 16, 2019, 11:45 PM IST

కాపురానికి రాలేదని భార్యను హతమార్చిన భర్త

అనంతపురం జిల్లా పుట్లూరు మండలం మడుగుపల్లి గ్రామానికి చెందిన శేఖర్... తన భార్య వెంకటలక్ష్మిని తొమ్మిది నెలలుగా వేధిస్తున్నాడు. కాపురానికి రాని కారణంగా కోపంతో రగలిపోయిన శేఖర్...సోమవారం రోకలి రాయితో తల పై కొట్టి అతి కిరాతకంగా భార్యను హత్యచేశాడు. సంఘటన స్థలానికి చేరుకున్న డీఎస్పీ శ్రీనివాసులు హంతకుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details