ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంటింటికి ఫీవర్ సర్వే నిరంతరం కొనసాగించాలి: మంత్రి బొత్స

ఇంటింటికి ఫీవర్ సర్వే నిరంతరం కొనసాగించాలని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. అనంతపురం జిల్లాలో కరోనా నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. అంబులెన్సుల నిర్వాహకులు ఇష్టారీతిన రేట్లు వసూలు చేయకుండా, వారితో సమావేశాలు నిర్వహించి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా ధరలను నిర్ణయించాలని పోలీసులకు సూచించారు.

మంత్రి బొత్స సత్యనారాయణ
మంత్రి బొత్స సత్యనారాయణ

By

Published : May 13, 2021, 11:43 PM IST

అనంతపురం జిల్లాలో కరోనా నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ఇంటింటికి ఫీవర్ సర్వే నిరంతరం కొనసాగించాలని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాప్తి, నియంత్రణపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కొవిడ్ పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించజానికి వీలుగా జిల్లాకు మరో 5 టన్నుల ఆక్సిజన్​ను అదనంగా కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి బొత్స తెలిపారు.

ఆక్సిజన్ నిల్వల కోసం అవసరమైతే ట్యాంకర్లను లీజు ప్రాతిపదికన సమకూర్చుకోవాలని కలెక్టర్​ను మంత్రి బొత్స ఆదేశించారు. అంబులెన్సుల నిర్వాహకులు ఇష్టారీతిన రేట్లు వసూలు చేయకుండా, వారితో సమావేశాలు నిర్వహించి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా ధరలను నిర్ణయించాలని పోలీసులకు సూచించారు. దురదృష్టవశాత్తూ మరణాలు సంభవించిన సందర్భాల్లో వారి బంధువులు మృతదేహాలను తీసుకెళ్లకపోతే వారికి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించాలని స్పష్టం చేశారు.

కొవిడ్ కేర్ సెంటర్లలో ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పలువురు ప్రజా ప్రతినిధులు మంత్రిని కోరారు. స్థానికంగా ఆక్సిజన్ ఉత్పత్తికి అవకాశం ఉన్న వాటిని పరిశీలించి వాటికి సంబంధించిన అనుమతులు త్వరగా మంజూరు అయ్యేలా చూస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. మందుల లభ్యత, డాక్టర్ల పర్యవేక్షణ తదితర అంశాలపై చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. జిల్లాలో ఫీవర్ సర్వే జరుగుతున్న తీరును సమీక్షించిన మంత్రి.. ఈ రకమైన సర్వేలు నిరంతరం నిర్వహించాలని, ప్రతి నాలుగైదు రోజులకు ఒకసారి జిల్లా మొత్తంలో సర్వే చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఇదీ చదవండీ:

ఆస్పత్రుల్లో పడకల మేరకు ఆక్సిజన్‌ సరఫరా ఉండాల్సిందే: సీఎం

ABOUT THE AUTHOR

...view details