ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మజీ మంత్రి  జేసీకి హైకోర్టు నోటీసులు - jc diwakar reddy

త్రిశూల్ కేసులో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సున్నపురాయి (లైమ్​స్టోన్) మైనింగ్ లీజు పొందడంలో త్రిశూల్ సిమెంట్ కంపెనీ మోసాలకు పాల్పడిందని పేర్కొంటూ 2011 లో హైకోర్టు పిటిషన్ దాఖలు కాగా..తాజగా నోటీసులు జారీ చేసింది.

మజీ మంత్రి  జేసీకి హైకోర్టు నోటీసులు

By

Published : Sep 19, 2019, 5:23 AM IST

అనంతపురం జిల్లాలో సున్నపురాయి (లైమ్​స్టోన్) మైనింగ్ లీజు పొందడంలో త్రిశూల్ సిమెంట్ కంపెనీ మోసాలకు పాల్పడిందని పెర్కొంటూ 2011 లో హైకోర్టు పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే . దర్యాప్తునకు స్వతంత్ర సంస్థలకు అప్పగించాలని దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ అయిన వారిలో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి, త్రిశూల్ సిమెంట్ కంపెనీ మేనేజింగ్ భాగస్వామి ఎస్ హుస్సేన్ బాష , ఎస్ . గోపాలరావు , తిమ్మాపురం దేవపుత్రుడు , జె . నాగసుబ్బారాయుడు తదితరలు ఉన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ . వి . శేషసాయి , జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాధరాయ్ తో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది .


అనంతపురం జిల్లా కొనుప్పలపాడు గ్రామ పరిధిలోని సర్వే నంబరు 22 / బిలో త్రిశూల్ సిమెంట్ కం పెనీకి 1605 ఎకరాల్లో లైమ్ స్టోన్ మైనింగ్ లీజు మంజూరు చేస్తూ ఏపీ సర్కారు 2006 ఏప్రిల్ 25న ఇచ్చిన జీవో ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ తాడిపత్రికి చెందిన వి . మురళీ ప్రసాద్ రెడ్డి పై కోర్టులో పిల్ దాఖలు చేశారు. మోసపూరితంగా మైనింగ్ లీజు పొందడంలో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డికి చెందిన త్రిశూల్ సిమెంట్స్ లో భాగస్వాములు , బినామీల పాత్ర ఉందని ఆరోపించారు . వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ...నోటీసులు జారీచేసింది .తదుపరి విచారణను అక్టోబర్ నాలుగో వారానికి వాయిదా వేసింది .

ABOUT THE AUTHOR

...view details