ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భౌతిక దూరం పాటించకుండా.. ఇలా ఉంటే ముప్పే! - Kadiri

అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం రెక్కమానులో వారపు సంతకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. భౌతిక దూరం పాటించాలన్న ప్రభుత్వ నిబంధనలను ఖాతరు చేయకుండా గుమిగూడి కొనుగోళ్లు చేశారు.

Here is away to physical distance
ఇక్కడ భౌతిక దూరానికి దూరం

By

Published : May 12, 2020, 5:43 PM IST

అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం రెక్కమానులో ప్రతివారం వారపు సంత జరుగుతుంది. కదిరి, రాయచోటి ప్రధాన రహదారిపై ప్రతి మంగళవారం సంత నిర్వహిస్తారు. కరోనా నియంత్రణకు భౌతిక దూరం పాటించాలన్న ప్రభుత్వ నిబంధనలను కొన్నిచోట్ల ప్రజలు పట్టించుకోవడం లేదు.

పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన వారంతా... కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. కొనుగోళ్లకు వచ్చిన వారితో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. పోలీసులు, సచివాలయ సిబ్బంది వారికి అవగాహన కల్పించి, ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details