అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సాయంకాలం నుంచి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. కుందుర్పి మండలంలో కుండపోత వర్షం కురవగా... పలు ప్రాంతాల్లో గాలులకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కళ్యాణదుర్గం మండలం గూబనపల్లి గ్రామంలో వ్యవసాయ పొలాల్లోకి నీళ్లు రాకుండా రైతులు అడ్డుకట్ట వేయడంతో బీసీ కాలనీలోని ఇళ్లలోకి నీరు ప్రవేశించాయి. దురద కుంట గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఈదురుగాలులకు రేకుల షెడ్లు లేచిపోయాయి.
కళ్యాణదుర్గంలో ఈదురుగాలులతో భారీ వర్షం - కళ్యాణదుర్గం నియోజకవర్గం తాజా వర్షం సమాచారం
కళ్యాణదుర్గంలో సోమవారం కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు కిందపడ్డాయి. పంట పొలాల్లోకి వర్షపు నీరు చేరింది.
బీసీ కాలనీలో ఇళ్లలోకి వచ్చిన నీరు